• పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన వైద్యుడు 
  •  బెంగళూరు రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీ.. ఎంఎస్ ఆప్తమాలజీలో..

వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డులో గల ‘వేద’ ఐ, ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ తిరునహరి వెంకట సాయి నేత్ర ఎంఎస్ ఆప్తమాలజీలో బెంగళూరు రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. కాలేజీ వారు పట్టాను వెంకటసాయి నేత్రకు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యుడు వెంకట సాయి నేత్రకు పట్టణవాసులు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

 

‘వేద’ ఆస్పత్రిలోనే వెంకట సాయి నేత్ర భార్య ఎంబీబీఎస్ ఎంఎస్(ఈఎన్‌టీ) వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. నాన్న అడుగుజాడలో వెంకటసాయి నేత్ర ముందుకు సాగుతారని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

జమ్మికుంట పట్టణ, మండల, పరిసర ప్రాంత గ్రామీణ ప్రజలకు మూడు దశాబ్దాలకుపైగా 1989 నుంచి ‘నయన’ ఐకేర్ ద్వారా సీనియర్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్‌గా కంటి వైద్య సేవలందిస్తున్న సురేశ్ బాబు తిరునహరి వారసత్వాన్ని వెంకటసాయినేత్ర ముందుకు తీసుకెళ్తారని పలువురు పేర్కొన్నారు.

 

అట్టహాసంగా ‘వేద’ ఆస్పత్రి ప్రారంభం.. ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట అధ్యక్ష కార్యదర్శుల చేతుల మీదుగా..