వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్వచ్ఛ తీర్థ అభియాన్( మన గుడులను పవిత్రంగా) కార్యక్రమాన్ని గురువారం కాశీబుగ్గ లోని కాశి విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, వరంగల్ తూర్పు బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడుతూ ఈనెల 14 నుండి 22 వరకు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు దేవాలయ ప్రాంగణమును శుభ్రపరచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్క హిందువు..తమ ప్రాంతంలోని దేవాలయాలను శుభ్రపరచాలని కోరారు.
ఈ స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, గడిపెల్లీ రాజేశ్వర రావు నాయకులు సిద్దం నరేష్, రత్నం కృష్ణ కిషోర్,మలడి తిరుపతి రెడ్డి, బాన్న ప్రభాకర్, కందిమల మహేష్, విశ్వనాథ్ పూర్ణ చందర్,కోమకుల నాగరాజు,అల్లి అజయ్, మేదిపెల్లీ నాగరాజు, సంగెం శంకర్, పాలకొండ కోటి, సతీష్ కట్టర్,మంద శ్రీను తదితరులు పాల్గొన్నారు.