వేద న్యూస్, చొప్పదండి/ గంగాధర :

గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడంతో చాలామంది పేద విద్యార్థులు చదువును ఇంటర్మీడియట్ తోనే ఆపేస్తున్నారు.

నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్న సదుద్దేశంతో మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు.

గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం. గురువారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు విద్యార్థుల కృతజ్ఞతలు తెలిపారు.