వేద న్యూస్, వరంగల్:
ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎం.డీ. ఖురేషి మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం, స్వచ్చత హే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దగ్గర మొక్కలు నాటారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్,ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, మాజీ సర్పంచ్ కేతిపెల్లి సరోజన,మాజీ వార్డు సభ్యులు రాసమల్ల శ్రీ విద్య, కిన్నెర రమేష్, దామెర శంకర్,అంగన్ వా డీ టీచర్, ఆశా కార్యకర్త, మహిళా సంఘాల వి.ఓ . ఏ, కేతిపెల్లి రాజిరెడ్డి,ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది రమేష్,సబిత తదితరులు పాల్గొన్నారు.