- కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్
- ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన యువనేత
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/కమలాపూర్:
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు అని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. కమలాపూర్ మండలకేంద్రంలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమలాపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రణవ్ మాట్లాడుతూ..ప్రచారం కమలాపూర్ మండలం నుంచే మొదలుపెడుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వపు రోజులు రానున్నాయని తెలిపారు.
రోడ్లు, కాలువలు మాత్రమే వేస్తే అభివృద్ధి కాదని చదువుకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, యువతకు అండగా ఉంటానని ప్రణవ్ హామీనిచ్చారు. కమలాపూర్ మండల ప్రజలు ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు. కార్యక్రమంలో కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్, నాయకులు తౌటం రవీందర్, బాలసాని రమేష్, విష్ణుదాసు వంశీ, దేశిని ఐలయ్య, కొండ రమేష్, కృష్ణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.