• బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్

వేద న్యూస్, హైదరాబాద్:

గత నెల 29 న  కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల లో జరిగిన ఫుడ్ పాయిజన్‌తో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శైలజ అనే విద్యార్థిని పరిస్థితి విషమించి మృతి చెందడం చాలా బాధాకరం అని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు.  మంగళవారం వాంకిడి మండలం ఢాబా గ్రామం లో విద్యార్థిని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

ఈ సందర్బంగా ప్రణయ్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థిని శైలజ మృతి చెందిందని ఆరోపించారు. నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్షంగా వ్యవహరించిన అధికారులని శాశ్వతంగా ఉద్యోగం నుండి తీసేయాలని డిమాండ్ చేశారు. 

విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించి.. కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి.. 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చి ఆదుకోవాలని కోరారు.  ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థిని మృతి కి నిరసన గా బుధవారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు  జిల్లా విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చాయని,  బీసీ యువజన సంఘం బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా లోని విద్యా సంస్థలు స్వచందంగా సహకరించాలని మనవి చేశారు.