వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
లూయిస్ ఆంధుల ఆదర్శ పాఠశాల వరంగల్ ఆటోనగర్ లో యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

 

ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం రక్తదానం చేస్తూ, రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న 50 మంది రక్తదాతలకు “రక్తవీర్ పురస్కార్ – 2024 ” అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు , డాక్టర్ బరుపాటి గోపి, డాక్టర్ మేఘన , డాక్టర్ అజిత్ అహ్మద్, అంధుల పాఠశాల నిర్వాహకురాలు నలివేలి కళ్యాణి మనం ఫౌండేషన్ అధ్యక్షులు రాజేందర్, జాక్సన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సాయి ప్రతాప్, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు) , కానిస్టేబుల్ బొట్టు కమలాకర్, కోలా రాజేష్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజ్జెల సుమన్ , పోట్లశ్రీ రాము, అలువల పృథ్వి, ఉప్పరపల్లి రాజ్ కుమార్, మండల భూపాల్, పాలకుర్తి విష్ణు, ఎస్.కె ముస్తఫా, ఊరటి రవికుమార్, యాద రవి కుమార్, మోడెం రాజశేఖర్ గౌడ్, గుల్లెపెల్లి శివకుమార్, బొలుగొడ్డు సతీష్, బొలుగొడ్డు అమృత్ వర్మ, మూల మధుకర్ రెడ్డి , కనుకుంట్ల నాగరాజు హాజరై అవార్డులు ఇచ్చారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. రక్తదానం చేసిన రక్తవీరులను అభినందించారు.