• మర్రిపల్లిగూడెం ప్రభుత్వ పాఠశాలలో 

 

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:

శ్రీ సత్య సాయి సేవ సమితి జమ్మికుంట వారి ఆధ్వర్యంలో మర్రిపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం సేవా సమితి ఆధ్వర్యంలో వైద్యులు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి పలు రకాల మందులు అందించారు. చిన్ననాటి నుండే ఆరోగ్య నియమాలు ఏ విధంగా అలవర్చుకోవాలో వివరించారు.

విద్యార్థులకు మానసిక ఉల్లాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని, అందుకే పిల్లలకు పలు రకాల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించామని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు.

పాఠశాల ఆవరణలో సుమారు 50 రకాల పండ్ల మొక్కలు విద్యార్థులతో కలిసి నాటారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవ సమితి ట్రస్ట్ సభ్యులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.