వేద న్యూస్, మఠంపల్లి :
కార్మిక చట్టలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన లేబర్ కోడ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. మఠంపల్లి మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్మిక వెల్ఫేర్ బోర్డ్ నిధులను కార్మికుల కోసమే ఖర్చుచేయాలనీ, అదేవిధంగా రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు సయ్యద్ రనీమియా, గిరిజన సంఘం అధ్యక్షుడు బాలు నాయక్, గ్రామపంచాయతీ అధ్యక్షుడు ఇంటు రవి, భవననిర్మాణ అధ్యక్షులు, ఆశ వర్కర్, అంగన్వాడీ, అమలి వర్కర్ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.