• ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల దోపిడీ అరికట్టాలి…

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి:

మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలలో ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ మాట్లాడుతూ మిర్యాలగూడలో ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీ అరికట్టడంలో విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వలన పేద విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పాఠశాలల విద్యార్థులే లక్ష్యంగా విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుండి స్కూల్ ఫీజు లే కాక బుక్స్,యూనిఫామ్స్,టై ,బెల్ట్ ల పేరిట లక్షల రూపాయల్లో ఫీజులు దండుకుంటున్నారు.

కొన్ని ప్రైవేటు బుక్ స్టాల్ లని అడ్డాగా చేసుకొని పుస్తకాల పేరిట వ్యాపారం కొనసాగిస్తున్న కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలలో ఫీజుల పట్టిక నిర్వహించాలి అలాగే గవర్నింగ్ బాడీ లేకుండా ఫీజులు పెంచే అధికారం ఈ ప్రైవేట్ యాజమాన్యానికి లేదు,వారు ఇస్టానుసారంగా ఫీజులు నిర్ణయించుకొని పాఠశాలలు అడ్డా గా చేసుకొని వారు ఫీజుల దోపిడీ చేస్తున్న కూడా ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు కానీ,ప్రజా ప్రతినిధులు కానీ ఎందుకు స్పందించడం లేదు అని ఆయన ప్రశ్నించారు.

విద్యాశాఖ నిర్ణయాన్ని గాలికి వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా పాఠశాలలు నడుపుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తానికి సిద్ధమై ఉన్నామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్,నరేష్,సాంబయ్య, ఉపేందర్,రమేష్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.