• హమాలీ కార్మికులను ల….కా అని దూషించిన సీఐ!?
  • ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ కార్మికుల నిరసన 

వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా లోడ్ మోస్తున్న తమను సీఐ దూషించాడని హమాలీ కార్మికులు నిరసనకు దిగారు.

దీంతో “ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? ” అంటూ పీఏసీఎస్ కేంద్రం వద్ద కార్మికులు నిరసన తెలిపారు. పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సదరు పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.