•  రైతుల ఆరోగ్యమే ప్రభాత్ సీడ్స్ కంపెనీ లక్ష్యం

వేద న్యూస్, జమ్మికుంట :

రైతులకు మంచి విత్తనాలు అందించడం తో పాటు రైతులకు,సమాజానికి, విద్యార్థుల కు మంచి ఆరోగ్యం కూడా అందించాలనే లక్ష్యం తో సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రభాత్ అగ్రి బయో లిమిటెడ్ సీడ్స్ కంపెనీ ప్రభుత్వ దవాఖానకు, ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ లను అందించినట్లు కంపెనీ ప్రతినిధులు డి ఆర్ యం పొలొజు రమేష్ తెలిపారు.

ఈ సందర్భంగా డి ఆర్ యం పొలొజు రమేష్ మాట్లాడుతూ హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ లను అందించామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలనే కాదు రైతుల యొక్క ఆరోగ్యాలు కూడా బాగుండాలనే ఉద్దేశ్యంతో మంచి నీరే మంచి ఆరోగ్యన్నీ అందిస్తుందని ప్రభాత్ అగ్రి బయో లిమిటెడ్ సీడ్స్ కంపెనీ కెంట్ వాటర్ ప్యూరిఫైర్ లను అందించిందని తెలిపారు.

విద్యార్థులకు కూడా మంచి త్రాగునీరు అందించి వారి ఆరోగ్యానికి బాసటగా నిలవాలని పాఠశాలలో కూడా వాటర్ ప్యూరిఫైర్ అందించామని పేర్కొన్నారు. భవిష్యత్తు లో కూడా ప్రభాత్ అగ్రి బయో లిమిటెడ్ సీడ్స్ కంపెనీ సామాజిక బాధ్యత లో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మౌనిక, చెల్పూర్ మాజీ సర్పంచ్ నెరేళ్ళ మహేందర్,హాస్పిటల్ సిబ్బంది, రాచపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి,ఉపాధ్యాయులు,విద్యార్థులు, రెండు గ్రామాల ప్రజలు,కంపెనీ ప్రతినిధులు ఎస్ ఓ. మైపాల్,వెంకటేష్, అనిల్ పాల్గొన్నారు.