వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రవి ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మరిపెడ సబ్ సెంటర్లో సబ్ సెంటర్ డాక్టర్ సాయి శ్రీ , మరిపెడ 11వ వార్డు కౌన్సిలర్ ఎడెల్లి పరుశురాములు ప్రారంభించారు. పోలియో నివారణ చుక్కల మందులను పిల్లలకు వేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం చంద్రకళ , ఆశా కార్యకర్తలు శ్రీదేవి, అనసూర్య పాల్గొన్నారు.