వేద న్యూస్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరులోని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ షాపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒకే సారి గురువారం గ్రామంలోని శ్రీరామ ఫర్టీలైజర్స్, ఫెస్టీసీడ్స్, చంద్రశేఖర్ ఫెర్టీలైజర్ అండ్ ఫెస్టీసీడ్స్, శ్రీనివాస, రాజరాజేశ్వర దుకాణాలలో తనీఖీలు చేపట్టారు.
మండలంలో తీవ్రంగా యూరియా కొరత ఏర్పడుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ మెరుపు దాడులతో ఒక్క సారిగా ఎరువుల దుకాణాలలో అలజడి నెలకొంది. గ్రామంలో డీసీఎంఎస్ గోదాంలను కూడా క్షుణ్ణంగా తనీఖీ చేశారు.
ప్రైవేటు డీలర్లకు సంబంధించిన గోదాంలలో, షాపులలో రోజువారీకి సంబంధించిన స్టాక్‌కు భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.19 లక్షలా 71 వేల 514 విలువ గల స్టాక్ మొత్తాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు.
రైతులకు అండగా నిల్వాల్సిన సమయంలో, ఎరువుల బస్తాలను ఎక్కువ మొత్తంలో రేటుకు అమ్ముతున్నారనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చినట్లు వారు వెల్లడించారు. ఎవరైన అక్రమంగా ఎరువుల బస్తా దాచిన, ఎక్కువ రేట్లకు అమ్మినా, కాలం చెల్లిన మందులను విక్రయించినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో విజిలెన్స్ తహశీల్దార్ దినేష్, చంద్రారెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు అనిల్ కుమార్, వరున్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి ఎం.సురేష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.