వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి:
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ, జ్యోతి నగర్ కు చెందిన డా, రాజలింగు మోతె అడ్వకేట్ భారత్ గౌరవ్ సమ్మాన్-2023 అవార్డు కు ఎంపికయ్యారు. ఈ అవార్డులో భాగంగా సంఘసంస్కర్త, సమాజ ప్రభావశీలుడుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు కలవల సతీష్ కుమార్, శ్రీరాంపూర్ డివిజన్ బీఎంఎస్ నాయకులు అవునూరి రమేష్, పట్టణ దళిత నాయకులు మంతెన మధు తదితరులు ఆయనను పట్టణం లోని సఖ్యత కేంద్రంలో ఘనంగా సన్మానించారు.