S.S. Rajamouli

వేదన్యూస్ – ఫిల్మ్ నగర్ 

ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికే చాటిచెప్పిన ప్రముఖ ప్రథమ దర్శకుడు. బాహుబలి మొదలు ఆర్ఆర్ఆర్ వరకూ జక్కన్న తీసిన సినిమాలన్నీ తెలుగోడి సత్తాను విశ్వానికి చాటాయి. అలాంటి దర్శకుడైన రాజమౌళి చేసిన చిన్న ట్వీట్ ఓ హీరో జీవితాన్నే మార్చేసింది. ఇది ఎవరో కాదు ఆ జీవితం మారిన హీరోనే చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ హీరో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మూవీ హృదయ కాలేయం.

ఈ చిత్రం విడుదలై నేటికి పదకొండు వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేసిన చిన్న ట్వీట్ తో నన్ను మీ ముందు హీరోగా నిలబెట్టింది. నేను ఎవరికైన రుణపడి ఉన్నాను అంటే అది ఆయనకే.

నేను నటించిన హృదయ కాలేయం మూవీ విడుదలై నేటికి పదకొండు వసంతాలు. ఇన్నాళ్ళు నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు.. నాఅభిమానులకు పాదాభివందనాలు.  అవకాశాలిచ్చి ప్రోత్సాహించిన దర్శక నిర్మాతలకు నేను సదా రుణపడి ఉంటాను. రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలతో మిమ్మలందర్నీ ఆలరిస్తానని అన్నారు.