•  ప్రధాన కార్యదర్శిగా సంతోష్, కోశాధికారిగా పూర్ణచందర్..

వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వికేఎస్పి జమ్మికుంట క్లబ్‌కు 2026 సంవత్సరానికి అధ్యక్షులుగా గుండా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి చందా సంతోష్, కోశాధికారి చిదురాల పూర్ణచందర్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిపురం రాజేష్, గవర్నర్ పుల్లూరి బాలమోహన్, ఎల్లంకి ప్రదీప్‌లతోపాటు వైస్ గవర్నర్ తంగళ్ళపల్లి రాజభాస్కర్, రివిజన్ చైర్ పర్సన్ రామిడి శ్రీనివాస్, జోన్ చైర్ పర్సన్ అయితు రమేష్, వాసవి క్లబ్ అధికారులు కె వెంకటేశ్వర్లు, గంప సురేందర్, అయిత సుధాకర్, సుద్దాల శ్రీనివాస్, యాంసాని రమేష్ బాబు, బళ్లు రమేష్, పుట్టూరి రమేష్, అయిత రమాదేవి, రావికంటి నీలకంఠం, గుండా కేదారి, అయిత స్వాతి, గార్లతోపాటు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వికేఎస్పి క్లబ్ సేవలను అందరికీ అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు.