వేద న్యూస్, వరంగల్ టౌన్ : 

వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా చేకూరుతుంది. తూర్పు నియోజకవర్గం లోని 32 వ డివిజన్ బీఆర్ఎస్ నాయకురాలు తరాల రాజమణి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తరాల రాజమణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజా ఆధారలను చూసి పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా కొండా దంపతులు ఉన్నా కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ  వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని కడియం కావ్యకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు తరాల రాజమణి కోరారు.