- ప్రజాదర్బార్ ఇన్‌చార్జి చిన్నారెడ్డికి రాజుర గ్రామస్తుల వినతి
వేద న్యూస్, హైదరాబాద్:
రాజుర గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిభాఫూలే భవన్ లో తెలంగాణా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మాజీ మంత్రి, ప్రజా దర్బార్ ఇన్ చార్జి జి. చిన్నారెడ్డి కి రాజుర గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 700 పై చిలుకు జనాభా ఉండటంతో పాటు అన్ని అర్హతలు తమ గ్రామానికి ఉన్నాయని చెప్పారు. రాజుర గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తామని చిన్నారెడ్డి హామీ ఇచ్చారని గ్రామస్తులు వెల్లడించారు.