Oplus_16908288

 

  • రాఖీ కట్టి ఆశీర్వదించిన మహిళా  మంత్రులు

వేద న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి :

రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులు, ఇతర ప్రతినిధులు పెద్దఎత్తున తరలిరావడంతో రాఖీ పండుగ సందడి వాతావరణం నెలకొంది.

మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ( సీతక్క), ముఖ్యమంత్రి కి రాఖీ కట్టారు. మాజీ మంత్రి డాక్టర్ గీతా రెడ్డి ముఖ్యమంత్రి కి రాఖీ కట్టి ఆశీర్వదించారు. వీరితో పాటు మరెందరో సోదరీమణులు రాఖీ కట్టారు.

ఈ వేడుకలో పాల్గొన్న బ్రహ్మకుమారీస్ సోదరీమణులు ముఖ్యమంత్రి ని కలిసి రాఖీ కట్టారు. మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల విద్యార్థినులు ముఖ్యమంత్రి ని కలిసి ఆప్యాయంగా రాఖీ కట్టారు.

 

అలాగే, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత, బీసీ కమిషన్, విద్యా కమిషన్, శిశు సంక్షేమాభివృద్ధి కమిషన్, రైతు కమిషన్ కు చెందిన మహిళా ప్రతినిధులు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావుతో పాటు మహిళా ప్రతినిధులు రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టారు.