వేదన్యూస్ – ఫిల్మ్ నగర్
వైజయంతి ప్రోడక్షన్స్ బ్యానర్ పై సి అశ్వనీ దత్ నిర్మాతగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ఇటీవల వచ్చి బంఫర్ హిట్ కొట్టిన మూవీ కల్కి. ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ పాత్రలో తళుక్కున మెరిసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో సైతం ఆర్జీవీ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మెక్సికో లో జరపనున్నట్లు ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. స్పిరిట్ మూవీలో ఆర్జీవీ ఓ పాత్రలో కన్పించనున్నారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తలపై ఆర్జీవీ స్పందిస్తూ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ మూవీలో నేను నటిస్తున్నాను అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నాకు ఆశ్వనీదత్తు తెలుసు.. ప్రభాస్ తెలుసు. వారిద్దరూ అడిగారనే సరదగా కల్కి మూవీలో నటించాను. అంతేకానీ స్పిరిట్ లో నేను నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు కేవలం సత్యదూరమైనవి అని ఆయన కొట్టిపారేశారు.