Harish Rao Thanneeru

వేదన్యూస్ – కల్వకుర్తి

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. అధికారంలోకి రాకముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రాష్ట్రంలో ఉన్న నలబై ఒక్క లక్షల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా చేస్తామని హామీచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కి అరకొర రుణమాఫీ చేశారు. అది ఎలా చేశారు.

కేసీఆర్ గారు రైతుబంధు కోసం దాచి ఉంచిన పదివేల కోట్లను.. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి యాసంగిలో ఇవ్వాల్సిన రైతుబంధు డబ్బులను ఎగ్గోట్టి రుణమాఫీ చేశామని రైతులను మోసం చేశారని అన్నారు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు. కల్వకుర్తి పర్యటనలో ఉన్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బోయిన్ గుట్ట తండాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ “రైతులకు పంటపెట్టుబడి సాయం కింద వానాకాలం రైతు బంధు  కింద ఇవ్వాల్సిన 8వేల కోట్లు,యాసంగి రైతు బంధు 4 వేల కోట్లు ఎగ్గొట్టారు.

ఈ రెండు కలిపి రుణమాఫీకి జమచేసిరుణమాఫీ అయిపోయింది అంటూ రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అని ఉద్ఘాటించారు. కరోనా కష్టకాలంలో సైతం మా మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు జీతాలు బంద్ జేసి రైతుల కు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని ఆయన అన్నారు.