వేద న్యూస్, హన్మకొండ :

ముస్లీం సోదరులకు దామెర గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నెలరోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులు అల్లా దీవెనలు నిండుగా అందుకోవాలని ఆకాంక్షించారు.

మతసామరస్యానికి తెలంగాణ రాష్ట్రం నిలువెత్తు నిదర్శనం అని స్పష్టం చేశారు. రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల కఠిన ఉపవాస దీక్షతో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, దాతృత్వం, ప్రేమ, దయ, సోదర భావం ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.