వేద న్యూస్, వరంగల్ టౌన్ :
పైడిపల్లి దర్గా లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో దర్గా పీఠధిపతి జనాబ్ మహమ్మద్ అనుకుషావాలి సాహెబ్ దర్గా కమిటీసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఠాధిపతి రంజాన్ పండుగ విశిష్టత ఉద్దేశించి ప్రసంగించారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి నేడు పండుగ జరుపుకుంటున్న తోటి ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.మతం అనే బేదాభిప్రాయం లేకుండా అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అల్లాను ప్రార్థించినట్లు పిఠాధిపతి అంకుశవాలి తెలిపారు.
అనంతరం ప్రతి ఏటా పండుగ సందర్బంగా తన తల్లి ఆశీర్వాదం తీసుకోవడం సాంప్రదాయకంగా కొనసాగిస్తు అరపెల్లిలో ఉన్న తన తల్లిని కలిసి ఆమె ఆశీర్వాదం పొందారు.