వేద న్యూస్, హన్మకొండ/దామెర:

గురువారం తో గ్రామ పంచాయతీలలో ప్రస్తుత పాలక వర్గం పదవీకాలం ముగిసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జీపీల్లో ప్రత్యేక పాలన తీసుకొచ్చింది. ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల మేరకు కలెక్టర్లు గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. 

హన్మకొండ జిల్లాలోని దామెర గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి( Special officer) గా మండల పంచాయతీ అధికారి కె.వి.రంగాచారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, కారోబార్ బొబ్బిలి,దురిషెట్టి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.