వేద న్యూస్, మరిపెడ:
రాత్రి మాత్రమే వికసించి.. తెల్లారగనే వాడిపోయే పుష్పం గురించి మీరు విన్నారా?.. బహుశా కొందరు విని ఉంటారు. కొందరు ఉండకపోవచ్చు. కాగా, రాత్రి మాత్రం అత్యద్భుతంగా వికసితంగా కనిపించి.. తెల్లారగానే వాడిపోయినట్టు కనిపించే ఆ పుష్పం పేరు ఏంటంటే.. ‘‘డ్రాగన్ పుష్పం’’.. మహబూబాాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఎల్లంపేట గ్రామంలో ముత్తడి సుధాకర్ రెడ్డి ఇంట్లో, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామానికి చెందిన దొమ్మటి తిరుపతి ఇంట్లో కనిపించాయి.
ఈ పువ్వు గురించి వారు మాట్లాడుతూ… ఓన్లీ నైట్ టైంలో మాత్రమే ఈ పుష్పాలు కనిపిస్తాయని వెల్లడించారు.

రాత్రి మాత్రమే వికసిస్తూ.. ఉదయానికి వాడిపోవడం ఈ పుష్పాల ప్రత్యేకతని వెల్లడించారు. కాగా, ఈ పుష్పాన్ని చూస్తు ఉంటే ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుందని వారు తెలిపారు.

