వేద న్యూస్, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)గా నియమితులైన వరగంటి రవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మికుంట పట్టణంలో ఎలాంటి ఆసాంఘిక కార్యక్రమాలు, దొంగతనాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు తెలపాలని సూచించారు. అనుమతి లేకుండా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా, అక్రమ మట్టి మాఫియా, ట్రాఫిక్ సమస్యల గురించి తన దృష్టికి వచ్చినట్టు పేర్కొన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించిన పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని వెంటనే స్పందిస్తామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా పట్టణ ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు.