• శరీర దానానికి ముందుకు వచ్చిన బచ్చమ్మ..
  •  మెడికల్ కాలేజీ మరణానంతరం బాడీ డొనేట్
  •  దానానికి అంగీకార పత్రం అందజేత
  • నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి అభినందన

వేద న్యూస్, మరిపెడ:
మరణానంతరం తన శరీరం సమాజానికి ఉపయోగపడాలని ముందుకు వచ్చి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఆమె.., మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రానికి చెందిన పెండెం బచ్చమ్మ మరణానంతరం తన పార్థివదేహాన్ని మహబూబాబాద్ మెడికల్ కాలేజీకి అందజేసేందుకు యాక్సెప్ట్ చేసింది. వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం ఉపయోగపడేందుకు తన మృతదేహం ఉపయోగపడుతుందని తెలుసుకున్న బచ్చమ్మ అంగీకార పత్రాన్ని తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం జిల్లా కన్వీనర్ పర్కాల రవీందర్ రెడ్డి‌కి బుధవారం అందజేశారు.

ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడారు. మరణానంతరం నేత్రాలు, శరీరం , బ్రెయిన్ డెత్ అయిన వారి నుంచి అవయవాలు దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో అవగాహన పెంచుకుని ఆపదలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించాలని కోరారు.

బచ్చమ్మ స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని, అందుకు సహకరించిన కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్ర నాగేశ్వరరావు, రిటైర్డ్ ఉద్యోగి బాదె వెంకన్న, దాత కుటుంబ సభ్యులు గుంటి శశిరేఖ, సురేష్, శ్రీహరి, గజ్జెల కళ్యాణ్, చెల్ల కిరణ్ పాల్గొన్నారు.