•     అపెండిక్స్ ఆపరేషన్ వికటించిన (సికల్ పర్ఫొరేషన్) విషయం చెప్పకుండా నిర్లక్ష్యం చేసిన వైద్యుడు
  • బాధితుడికి న్యాయం జరిగే వరకూ సర్జన్ ఎక్కడ ప్రాక్టీస్ చేయద్దు
  • ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తరాల సందీప్ డిమాండ్ 

వేద న్యూస్ , వరంగల్:

హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ లో జర్నలిస్టు కృష్ణకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులు తక్షణమే విచారణ జరిపి సర్జన్ నళిన్ కృష్ణ , హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తరాల సందీప్ డిమాండ్  చేశారు.

జర్నలిస్టు కృష్ణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తరాల సందీప్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బంధన్ హాస్పిటల్ వైద్యుడు సర్జన్ నళిన్ కృష్ణ నిర్వాకం వల్లే జర్నలిస్టు కృష్ణ ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలలపాటు మంచానికి పరిమితం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఏడాది 21 జూలైన చేసిన అపెండిక్స్ ఆపరేషన్ 

వికటించిన (సికల్ పర్ఫొరేషన్) విషయం చెప్పకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే జర్నలిస్టు కృష్ణకు ఆ పరిస్థితి వచ్చిందని అన్నారు. కావున అధికారులు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మీద త్వరగా స్పందించి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని పేర్కొన్నారు.