•  పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో..

వేద న్యూస్, వరంగల్:

పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలపై హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి లక్మీ రామాకాంత్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

జీపీలకు నిధుల్లేకపోవడంతో పాటు ప్రజాప్రతినిధులు సైతం లేకపోవడంతో విధుల నిర్వహణ.. గ్రామాల్లో పారిశుధ్యం ఇతర కార్యకలాపాల నిర్వహించుట ఇబ్బందికరంగా మారిందని వివరించారు. తగు చర్యలు తీసుకోవాలని డీపీవోను కోరారు. 

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఫోరం  హన్మకొండ జిల్లా అధ్యక్షుడు  జనుగానీ అశోక్, ప్రధాన కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ వెంకటేశం,ఈ.సి.మెంబర్ అర్శం శ్రీనివాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వెంకన్న, ఉపాధ్యక్షులు మనోహర్, జాయింట్ సెక్రెటరీ శివ శంకర్,హనుమకొండ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి, శ్వేత పాల్గొన్నారు.