వేద న్యూస్, వరంగల్:

ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ డాక్టర్ కడియం కావ్యను నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సన్మానించి.. ఆరె సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి ఫండ్స్ కేటాయించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ మాట్లాడుతూ హైదరాబాద్ ఉప్పల్ భగయాత్‌లో ఆరె సంక్షేమ సంఘం భవన నిర్మాణం కోసం ఎంపీ నిధుల కింద ఫండ్స్ కేటాయించాలని కోరారు. ఇందుకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్, రాష్ట్ర గౌరవ సలహా దారులు మారుజోడు నర్సింహా రావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెకారి రంగారావు, భవన నిర్మాణ కమిటీ కోఆర్డినేటర్ కె. ఎన్ రావు, రాష్ట్ర నాయకులు దామెరగిద్దె ప్రభాకర్, జిల్లా నాయకులు కుడ్లే మనోహర్, గురిజాల నిరంజన్, సదానందం,అడగాని శివాజీ,కౌడగాని సుధాకర్,ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.