వేద న్యూస్, మహబూబాబాద్/మరిపెడ:
బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో నేడు (శుక్రవారం) ఉదయం 8.30 గంటలకు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఎంపీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జాతీయ జెండావిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు,
గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, గులాబీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ తప్పనిసరిగా పాల్గొనవాల్సిందిగా కోరారు.