వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ జిపి ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 జాతీయగీతం జనగణమనను అందరూ ఆలపించారు. “బోలో స్వతంత్ర భారత్ కి జై, భారత్ మాతాకీ జై” అంటూ నినాదాలు చేశారు

అనంతరం సెక్రెటరీ నరేష్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు, హక్కులు పౌరులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి హక్కులు కల్పించడంతో పాటు సాధికారిత అందించేందుకు అంబేద్కర్ వంటి మహనీయుల కృషి ఎంతో ఉందని వెల్లడించారు.

భారత రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్, బాబు రాజేంద్రప్రసాద్, వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులు దూర దృష్టితో ఎంతో ఆలోచించి రాజ్యాంగ నిర్ణాయక సభలో ప్రతి అంశంపై చర్చించారని పేర్కొన్నారు.

 

 

కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కిరణ్, ఆత్మకూరు మార్కెట్ డైరెక్టర్ శంకర్, కాంగ్రెస్ సోషల్ మీడియా పర్సన్ రాజు, మాజీ సర్పంచ్ సరోజన, గ్రామ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.