వేద న్యూస్, హైదరాబాద్:

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించేలా వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ తనయ కవితపై గులాబీ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను ఆమె పంపించారు. 

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను ఆమోదించాలని గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ కు లేఖ పంపారు. ఇదే క్రమంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సభ్యత్వానికి సైతం కవిత రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని శాసనమండలి చైర్మన్ కు లెటర్ రాశారు.