Revanth Reddy AnumulaRevanth Reddy Anumula

వేదన్యూస్ -జూబ్లీహిల్స్ 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై తాము తదుపరి తీర్పు ఇచ్చేవరకూ ఎలాంటి పనులు చేయకండి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేస్తూ విచారణను ఈ నెల పదహారు తారీఖుకు వాయిదా వేసిన సంగతి తెల్సిందే.

మొన్న హైడ్రాతో ఇవాళ హెచ్ సీయూ భూముల వ్యవహారంతో పరువు పోయిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా వివాద పరిష్కారంకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఓ కమిటీ వేశారు.

సీఎంతో సహా మంత్రులు భట్టీ విక్రమార్క మల్లు, దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సభ్యులుగా క్యాబినెట్ స్థాయి కమిటీలో ఉంటారు. ఈ కమిటీ హెచ్ సీయూ కార్యానిర్వాహాణ కమిటీ, జేఏసీ, పౌర సమాజం ,విద్యార్థి నాయకుల బృందం, ఇతర సంబంధితా వ్యక్తులతో సమావేశమవుతుంది. ఈ వివాదానికి పరిష్కారం కనుక్కోవడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార సోషల్ మీడియాలో హ్యాండిల్ లో పోస్టు చేశారు.

https://x.com/revanth_anumula/status/1907821703704482087