వేద న్యూస్, నిజామాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాననిందితుడైన రౌడీషీటర్ షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం, బైక్ దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న సీసీఎస్ కానిస్టేబుల్ప్రమోద్‌ను కత్తితో పొడిచి హత్య చేసి రియాజ్ పరారయ్యాడు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగాకలకలం సృష్టించడంతో, నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపుచర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, ఆదివారం నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ప్రాంతంలో రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు పట్టుబడడానికి ముందు, వేరే వ్యక్తితో జరిగిన ఘర్షణలో గాయాలవ్వడంతోఅతన్ని చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈసందర్భంగా, రియాజ్‌ను ఎన్‌కౌంటర్ చేసినట్లు వచ్చిన వార్తలను నిజామాబాద్ పోలీస్కమిషనర్ సాయి చైతన్య ఖండించి, నిందితుడు ప్రాణాలతోనే ఉన్నాడని, చికిత్సపొందుతున్నాడని ప్రకటించారు.
అయితే, సోమవారం ఉదయం చికిత్స పొందుతున్న రియాజ్, ఆసుపత్రి నుంచిపారిపోయేందుకు యత్నించాడు. ఈ ప్రయత్నంలో, తన పక్కనే ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ వద్దనుండి తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నించడంతో, అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణకోసం నిందితుడిపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రియాజ్మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.