• సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తుల రిక్వెస్టు
  • రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

 

వేద న్యూస్, సుల్తానాబాద్:

సుల్తానాబాద్ మండల పరిధిలోని పూసాల గ్రామంలో రోడ్లు సరిగా లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. పెద్దమ్మ గుడి సమీపంలోని సిద్ద కనకయ్య లేన్ లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, కొద్దిగా వర్షం పడినా రోడ్లు మట్టి మయంగా మారి, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు తెలిపారు. 

2018లో గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఈ రోడ్డును చక్కదిద్దుతామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని స్థానికులు చెబుతున్నారు.  పంచాయతీ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయమై పలు సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పూసాల పెద్దమ్మ గుడి దగ్గర సిద్ద కనకయ్య లేన్‌లో తక్షణమే శాశ్వత రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు.