వేద న్యూస్, కోదాడ/చింతలపాలెం :
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కట్ట మైసమ్మ ఆలయం వద్ద దారుణ దుర్ఘటన చోటు చేసుకుంది.కోదాడ నుండి నక్కగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించపోయి అదుపు తప్పి కాలువలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 65 మంది ప్రయాణికులు ఉండగా అందులో 25 మందికి స్వల్ప గాయపడ్డారు. 10 మందికి తీవ్ర గాయాలు కాగా 108 సహాయంతో క్షత్రగాత్రులను హుటాహుటిన మెల్లచెరువు,హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం జరగటానికి ముఖ్య కారణం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించపోయి అదుపు తప్పటంతో దాన్ని నియంత్రించే సమయంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోవటంతో బస్సు బోల్తా పడిందని అంటున్నారు. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న చింతల పాలెం గ్రామంలో యువత హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని మానవత్వాన్ని చాటుకొని సహాయక చర్యలు చేపట్టి ముందుండి గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించడానికి సహాయ సహకారాలు అందించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం లేపింది ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.