వేద న్యూస్, హన్మకొండ :
బల్దియాకు బకాయి పడి ఉన్న ఆర్ టి సి హన్మకొండ డిపో కు చెందిన ఆస్తి పన్ను రూ.27 లక్షల 81 ల చెక్ ను బల్దియా డిప్యూటీ కమిషనర్ గొడిశాల రవీందర్ కు డిపో మేనేజర్ మంగళవారం ఆర్ టి సి కార్యాలయం లో అందజేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధి లోని గృహ యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులు వారి ఆస్తి పన్నును ఈ నెల 31 లోపు చెల్లించి 90 శాతం రిబేట్ పొందవచ్చని ఇట్టి అవకాశం కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్నందున ప్రతి ఒక్కరు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మోహన్ రావు, రెవెన్యూ అధికారి యూసుఫోద్దిన్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.