- విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తన వంతు కృషి
- సామాజికవేత్తగా చక్కటి పేరు సంపాదించుకున్న వెంకట్
వేద న్యూస్, హూజూరాాబాద్:
‘మానవసేవే మాధవసేవ’ అనే సిద్ధాంతాన్ని బహుశా ఆయన మనసా వాచా కర్మేణా నమ్ముతారు కావచ్చు. అందుకే తన శక్తి మేరకు ఎవరికైనా, ఏ క్షణంలోనైనా సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారని చెప్పొచ్చు. ఇంతకీ ఆయన ఎవరంటే.. కార్పొరేట్ వరల్డ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండి.. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సిర్సపల్లి వాసి సబ్బని వెంకట్. యువవాదిగా బలమైన నెట్‌వర్క్ కలిగిన ఆయన సామాజికవేత్తగా సేవామార్గంలో పయనిస్తున్నారు.
మౌలికంగా ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తన వంతుగా శక్తి మేరకు వెంకట్ కృషి చేస్తున్నారు. తన పలుకుబడిని పది మందికి మంచి చేసేందుకు ఉపయోగిస్తానని ఆయన పేర్కొంటుండటం విశేషం. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచన చేయడమే నిజమైన అభివృద్ధి కోసం.. పని చేయాలనే ఆలోచన రేకెత్తేలా బలమైన అడుగులు వెంకట్ వేస్తున్నారు.
వివిధ రాజకీయ పార్టీల నాయకులతో తనకున్న సత్సంబంధాలను ప్రజాసంక్షేమం కోసం వినియోగిస్తు్న్నారు. అజాతశత్రువుగా ఉంటూ.. అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ముందుకు సాగుతున్న వెంకట్.. అడుగులు ప్రజాక్షేత్రంలోకి మున్ముందు బలంగా పడతాయని ఊహాగానాలు వినబడుతుండగా.. అది నిజం కావాలని సబ్బని అనుచరగణం ఆశిస్తోంది.
తనకు రాజకీయంగా పార్టీలపరంగా ఎలాంటి రాజకీయ హోదా లేకున్నా.. వ్యక్తిగతంగానే సబ్బని వెంకట్ చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎవరికీ ఏ ఆపద వచ్చిన అందరి కంటే ముందు వెంకట్ స్పందిస్తున్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి నింపేందుకు తన వంతుగా వెంకట్ .. దివంగత కోచ్ లవన్ కుమార్ పేరిట క్రికెట్ ట్రోఫీని నిర్వహించారు.

నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని యువకులకు క్రీడల పరంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆ సందర్భంలో వెంకట్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో పేదలకు ఆరోగ్యం విషయంలో ట్రీట్‌మెంట్ విషయమై వైద్యులతో మాట్లాడటంతో పాటు అనారోగ్య ట్రీట్‌మెంట్‌కు ఎల్‌వోసీలను సబ్బని వెంకట్ తన టీమ్ ద్వారా అందిస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గ పరిధిలో వివిధ కారణాలరీత్యా మృతి చెందిన ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు బియ్యం తన టీమ్ ద్వారా అందిస్తున్నారు.
హుజురాబాద్ పండ్ల మార్కెట్ అగ్నిప్రమాద విషయంలో వెంకట్ స్పందించిన తీరు తెలిసిందే. అందరికంటే ముందే వారికి సాయం ప్రకటించడంతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల భర్తీపై హెల్త్ మినిస్టర్ రాజనర్సింహకు వినతి పత్రం సమర్పించడం, సిర్సపల్లిలోని తన ఇంటి వద్ద ‘ప్రజాదర్బార్’ నిర్వహించి.. తన ఇంటికి వచ్చిన ప్రజలకు శక్తి మేరకు పనులు చేసిపెట్టడం చూస్తుంటే.. సబ్బని వెంకట్ భావి నాయకుడిగా మరింత బలంగా ప్రజాక్షేత్రంలో ఉండాలనే అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
