• బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రణయ్
  •  ఘనంగా ఆత్రం బర్త్ డే..విద్యార్థులకు బుక్స్, పెన్నుల పంపిణీ

వేద న్యూస్, ఆసిఫాబాద్:
ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు జన్మదినం సందర్భంగా నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ మండలంలోని అడా దస్నాపూర్, వావుదాం, డెమ్మదిగూడ, బనారగొంది, జిల్లా కేంద్రంలోని యూఆర్ఎస్, అనాథ ఆశ్రమం లో, విద్యా సంస్థల్లో జరిగిన కార్యక్రమాల్లో బీసీ యువజన సంఘం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు.

స్టూడెంట్స్ కు పుస్తకాలు, పెన్నులు, పుస్తకాలు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణయ్ మాట్లాడుతు ఆత్రం సక్కు నిస్వార్థానికి నిజమైన నిదర్శనం అని చెప్పారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే గా ఉండి నియోజకవర్గనికి ఎన్నో సేవలు చేశారని చెప్పారు. ఆయన సేవలు మరువలేనీవని కొనియాడారు.

కార్యక్రమం లో ఆడదాస్నాపూర్ మాజీ సర్పంచ్ కోరేంగా లింగు, ఆత్రం అంకిత్, గాజర్ల శైలేందర్, రాపర్తి కార్తీక్, కస్తూరి నిఖిల్,రాపర్తి ప్రశాంత్, ఎండీ తాజ్, కోరేంగా సంతోష్, కట్కార్ గౌతమ్,బుర్స భూపతిరజు తదితరులు పాల్గొన్నారు.