వేద న్యూస్, జమ్మికుంట:

ఆకుల సదానందం, కొడిపాక సురేశ్‌లు తమ వన్ ప్లస్, రెడ్మీ 9 ప్రో మొబైల్స్ పోగొట్టుకున్నారు. ఈ విషయమై వారు ఇరువురు జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేశారు. వారి ఫోన్ల ఫోన్ల IMEA Number, CEIR PORTAL ద్వారా వారి మొబైల్స్‌ను జమ్మికుంట పోలీసులు ట్రేస్ చేశారు. ఆ ఫోన్లను పట్టుకున్నారు. బాధితులకు జమ్మికుంట ఇన్ స్పెక్టర్ ఎస్.రామకృష్ణ బుధవారం అందజేశారు. ఎవరైనా తన మొబైల్ ఫోన్స్‌ను పోగొట్టుకున్నప్పుడు వెంటనే CEIR PORTAL లో అప్‌లోడ్  చేయించుకోవాలని జమ్మికుంట టౌన్ ఇన్ స్పెక్టర్ ఎస్. రామకృష్ణ సూచించారు.