Samantha Ruth Prabhu

వేదన్యూస్ – ముంబై

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ సీనియర్ హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నారా..?. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో సమంత డేటింగ్ లో ఉన్నారనే వార్తలు నిజమేనా..?. వీరిద్దరీ పెళ్లికి సమంత కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?.

ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ పెళ్ళి పీటలు ఎక్కనున్నారా ..?. అంటే ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. గతంలో హీరో అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొన్నాళ్ల పాటు తన పని తాను చేసుకుంటూ ముందుకుసాగారు.

తాజాగా గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరి విషయాన్ని ఇరువైపులా వాళ్లు ఒప్పుకున్నారు. సమంత రెండో పెళ్ళికి సమంత కుటుంబ సభ్యులు సైతం అంగీకరించారు. ఈ మే నెలలో వీరిద్దరూ అధికారకంగా ఒకటి కానున్నట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇరువైపులా నుండి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.