- సదరు నంబర్‌పై రూ.4 వేల పై చిలుకు చలాన్
- ఇంతకీ ఈ ఫైన్ ఎవరు చెల్లించాలి..? మరి..
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
నంబర్ ఒక్కటే..కానీ, వాహనాలు మూడు.. వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. వరంగల్ నగరంలో యూనికాన్, గ్లామర్ రెడ్, బ్లూ కలర్ ద్విచక్ర వాహనాలకు ఒకే నంబర్ (TS 03 EF 8615) గల నంబర్ ప్లేట్ వాడుతూ.. నగరంలో వాహనదారులు చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక కెమెరాకు చిక్కాయి.
దాంతో అసలు ఒకే నంబర్‌ను రవాణా శాఖ అధికారులు మూడు బండ్లకు కేటాయించారా? లేదా? వాహనదారులు మ్యానిపులేట్ చేస్తున్నారా? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఒకే నంబర్‌ను రవాణా శాఖ అధికారులు 3 వాహనాలకు కేటాయిస్తే.. అది వింతేనని పలువురు అంటున్నారు.

సదరు నంబర్‌పై రూ.4,385 చలాన్ పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఇప్పుడు ఈ ఫైన్‌ను సదరు ముగ్గురు వాహనదారుల్లో ఎవరు చెల్లిస్తారు? అనే ప్రశ్నకు ఎవరు సమాధానం ఇస్తారో చూడాలి. ఈ విషయమై ట్రాఫిక్ ఉన్నత అధికారులు విచారణ చేపట్టి.. తగు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

