వేద న్యూస్, రుద్రూర్ :
ఎలాంటి అనుమతులు లేకుండా పోతంగల్ నుండి రుద్రూర్ మీదుగా రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం రాత్రి ఎస్సై సాయన్న పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ట్రాక్టర్ యాజమానుల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.