- శాలువాతో సీఎంకు ఘన సన్మానం
- గొప్ప క్రమశిక్షణ గల నేత రేవంత్ అని వ్యాఖ్య
వేద న్యూస్, జమ్మికుంట:
ఆర్యవైశ్యులు అన్ని విధాలుగా ఎదగాలని, పేద, మధ్యతరగతి ఆర్య వైశ్యులు సమాజంలో ఎదిగి గౌరవప్రదంగా నిలవాలనే ఆశయంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనుముల వైశ్య కార్పొరేషన్ ప్రకటించారని వాసవి క్లబ్ జమ్మికుంట అధ్యక్షులు శరత్ కుమార్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రేవంత్ కు శాలువాతో ఘనంగా సన్మానం చేసి..ఫ్లవర్ బొకే ఇచ్చిన కృతజ్ఙతలు తెలిపారు. వాసవి క్లబ్ కమిటీ సభ్యుల పక్షాన ధన్యవాదాలు చెప్పారు. ఆర్యవైశ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటానని రేవంత్ పేర్కొన్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గొప్ప క్రమశిక్షణ కలిగిన నేతని కొనియాడారు. మరోసారి ఆయనకు శరత్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.