- ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్
- కత్తెర గుర్తుకు ఓటేయాలని గడపగడపకు తిరుగుతూ ప్రచారం
వేద న్యూస్, సుల్తానాబాద్:
ప్రజాసేవే ధ్యేయంగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థి ఓగుల పూజ రాజేందర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాట్నపల్లి గ్రామ ప్రజలందరినీ కలుస్తూ.. ఆత్మీయంగా ఓటు అభ్యర్థిస్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరుతూ గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం సర్పంచ్ అభ్యర్థి పూజ, మద్దతుదారులు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
ఆశీర్వాదాలు పొందుతూ..
ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్ దంపతులు ఓటు అభ్యర్థిస్తూ.. ప్రజల ఆశీర్వాదాలు పొందుతూ ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా పలువురు పేర్కొంటున్నారు. కాట్నపల్లి గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా తమ అడుగులు ఉంటాయని, అవినీతికి తావు లేకుండా పరిపాలన అందిస్తామని హామీనిస్తున్నారు.
తాము పేదరికం నుంచి వచ్చిన వారమని, పేదరికం విలువ తెలిసిన మనుషులం కాబట్టి.. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు .. చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సర్పంచ్ అభ్యర్థి ఓగుల పూజ రాజేందర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

