- గడప గడపకు తిరుగుతూ ప్రచారం..
- కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి
- సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్
వేద న్యూస్, సుల్తానాబాద్:
తమను ఆదరించాలని కోరుతూ.. కాట్నపల్లి సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్ ప్రజలను కోరుతున్నారు. ప్రచారంలో వారు ముందు వరుసలో దూసుకెళ్తున్నారు. కాట్నపల్లి గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నారు.
నిండు మనసుతో ప్రతీ ఒక్కరూ తమకు మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి తమను భారీ మెజారిటీతో సర్పంచ్‌గా గెలిపించాలని పూజ రాజేందర్ కోరుతున్నారు.
తమ ఇంటి ఆడబిడ్డగా ప్రతీ ఒక్కరూ తమను ఆదరించాలని సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్ కోరుతున్నారు. సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్ దంపతులు గ్రామంలో గడపగడప తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
