వేద న్యూస్, మరిపెడ: 

చెట్లను పెంచుతూ, ఫ్లాస్టిక్ ను నివారిస్తూ, పర్యావరణాన్ని కాపాడు కోవాలని, ఔషధ మొక్కలను విరివిగా పెంచాలని, భూమాతను కాపాడుకోవాలని యస్సీఈఆర్టీ పాఠ్యపుస్తక రచయిత,  సిజిఆర్ స్టేట్ కో ఆర్డినేటర్ యానాల వెంకటరెడ్డి అన్నారు.

స్థానిక మరిపెడ ఉన్నత పాఠశాలలో ప్రధానోపా ధ్యాయులు అనంతరావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రామ్ క్రింద ఔషధ మొక్కలు నాటుట, వర్మి కంపోస్ట్ పిట్, ఇంకుడు గుంత కార్యక్రమాలు చేపట్టారు.

వినూత్నంగా 6,7,8 తరగతుల విద్యార్థినుల చేత ప్రారంభ కార్యక్రమాలు నిర్వహింప చేసి విద్యార్థులందరి చేత భూ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకంను తగ్గించాలని, వీలైనంత వరకు చేతి సంచులు వినియోగించాలని, తడి చెత్తను వర్మికంపోస్ట్ గా మార్పు చేసి వినియోగించుకోవాలని చెప్పారు. 

 

విద్యార్థుల చేత ప్రత్యేక పద్ధతిలో ఇరవై డిక్క-రకాల ఔషధ మొక్కలు నాటించారు. ఈ మొక్కలు పరిరక్షించే బాధ్యత ఉపాధ్యాయులు, విధ్యార్థులు తీసుకోవాలని అన్నారు. ఇంకుడు గుంతలను గ్రామంలో ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

తర్వాత వృక్షపూజ నిర్వహించి, ఔషధ మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ, క్యాన్సర్ నివారణకు, గుండె పనితీరు మెరుగుదలకు ఉపయోగ పడే మొక్కలు పాఠశాలకు అందించామని తెలిపారు. 

కార్యక్రమంలో సిజిఆర్ జిల్లా కో ఆర్డినెటల్ శంకరయ్య, ఫీల్డ్ కో ఆర్డినేటర్లు కోటయ్య, యాకయ్యలు, సీనియర్ ఉపాధ్యాయులు, స్టాఫ్ సెక్రటరీ బయగాని రాంమోహన్, ఫిజికల్ డైరెక్టర్ రాజకుమారి, ఉపాధ్యాయ బృందం జనార్ధనా చారి, దేవుల, స్వప్న, ప్రకాష్, శౌరి, రమేష్ రెడ్డి, లెనిన్, ప్రసాదరావు, సారయ్య, జహెదా, సురేష్, బాబురావు, అనిత, మంజుశ్రీ, శంకర్, సుజాత, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.