వేద న్యూస్, మరిపెడ:
మరిపెడ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో నరసింహుల పేట, చిన్న గూడూరు, మరిపెడ మండలాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయు లకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ జరిగింది.
ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పాఠశాలలు సందర్శించిన సమయంలో పరిశీలించిన అంశాలపై మాట్లాడి, నిర్మాణాత్మక పరీక్షల రివ్యూ చేయడం జరిగింది. ఉపాధ్యాయులందరూ గుణాత్మకమైన విద్యను అందజేయాలని విద్యార్థినీ విద్యార్థులను ఆంగ్లంలో నిష్ణాతులుగా తయారు చేయాలని అన్నారు.
తదుపరి ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్ రామ్మోహన్ బయగాని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, లైబ్రరీ, లాంగ్వేజ్ ల్యాబ్ కాన్స్టిట్యూషన్, ఇంగ్లీష్ క్లబ్, లెర్నింగ్ అవుట్ కమ్స్ అను అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంతరావు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ (ఎల్టా) ప్రధాన కార్యదర్శి బయగాని రామ్మోహన్, ఎల్టా బృందం మరిపెడ మండల ఉత్తమ ఉపాధ్యాయులైన చిన్నగూడూరు ఆంగ్ల ఉపాధ్యాయులు సతీష్ రెడ్డి మరియు వీరారం ఆంగ్ల ఉపాధ్యాయులు మర్రెడ్డి లను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సిఆర్పి రమేష్ నరసింహులపేట, చిన్న గూడూరు, మరిపెడ మండలాల ఆంగ్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.